గ్రేట్ జాబ్ డాక్టర్ సాబ్: గర్భంలోని బిడ్డకు బ్రెయిన్ సర్జరీ !

-

కొన్ని కొన్ని సార్లు మెడికల్ హిస్టరీ లోనే జరగని ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. తాజాగా అటువంటి ఒక అద్భుతం ఒకటి యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా లో చోటు చేసుకుంది, అమెరికాకు చెందిన ఒక గర్భిణీ గర్భంలో ఉన్న శిశువుకు మెదడు నుండి రక్తాన్ని గుండెకు తీసుకు వెళ్లే రక్తనాళం సరిగా అభివృద్ధి చెందలేదని టెస్ట్ రిపోర్ట్స్ లో తెలిసింది. ఈ సమస్య కారణంగా శిశువు జన్మించిన అనంతర, గుండె సమస్యలు, మెదడు దెబ్బ తినడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు జాలుగుతాయని డాక్టర్లు తెలిపారు. దీనితో ఆందోళన చెందిన శిశువు తల్లితండ్రులు ఎలాగైనా చేసి శిశువును కాపాడాలని వేడుకున్నారు. బోస్టన్ లోని వైద్యుల బృందం దీనిని ఒక ఛాలెంజ్ గా తీసుకుని రంగంలోకి దిగారు.

గర్భంలో ఉన్న ఈ శిశువుకు సక్సెస్ ఫుల్ గా బ్రెయిన్ ఆపరేషన్ చేసి తల్లితండ్రులకు శుభవార్తను అందించారు. తద్వారా ఆ శిశువుకు ఆ సమస్య తొలగిపోయినట్లు తెలిపారు. ఇప్పుడు ఈ బోస్టన్ హాస్పిటల్ ను మరియు డాక్టర్ లను అభినందిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news