పిల్లలకు ప్రేరణగా ఉండబోతున్న సినిమా అచీవర్స్..!!

-

ఈ రోజుల్లో బాలల పై వచ్చే సినిమాలు చాలా అరుదై పోయాయి. గతంలో బాలల పై ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. వాటిల్లో పిల్లలకు ఉపయోగపడే ఎన్నో నైతిక విలువలు ఉండేవి. ఇక ప్రస్తుత సమాజంలో పిల్లలందరూ మొబైల్ కు వీడియో గేమ్స్ కు బానిసలుగా తయారు అయ్యారు. వారి వద్ద నుండి మొబైల్ తీసుకుంటే ఇరిటేట్ అయ్యి అన్నం తినడం మానేస్తున్నారు. ఇక వారికి కథలు చెప్పి నీతివంతమైన పౌరులుగా మార్చే తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మ లు  వారికి దూరం అయ్యారు.ప్రస్తుతం పిల్లలను మోటివేట్ చేసేవారు కరువయ్యారు. పెద్ద సినిమా సంస్థలు లాభాలే లోకంగా పిల్లల పై సినిమాలు తీయడం మానేశాయి. కాని ఒక చిన్న డైరెక్టర్ మాత్రం పిల్లల పట్ల తన అభిమానం చాటుకొని సినిమా తీశారు. ఆ సినిమా పేరే అచీవర్స్. ఈ సినిమా తీసిన దర్శకుడు పేరు తల్లాడ సాయికృష్ణ. తాను తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారి సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో సత్యనారాయణ గారు ఒక పాత్ర కూడా చేయడం జరిగింది.

ముగ్గురు పిల్లలు తమతెలివి తేటలతో దేశాన్ని నాశనం చేయాలని చూసిన ఉగ్రవాదుల ఆట ఎలా కట్టించారు అనేది ఈ సినిమా కథ, టైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక సినిమా లో వచ్చే పాట మరియు సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ గా మారింది. నువ్వే ఒక సైన్యం అనే పాటను సుమంత్ బొర్ర పాడగా వెంకటేష్ ఉప్పల సంగీతం అందించారు. వీరు ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ వారి ద్వారా ఆకట్టుకొనే ప్రైవేట్ సాంగ్స్ చేశారు. ఈ సినిమాలో పాట కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ప్రసాద్ లాబ్స్ లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పర్యాటక సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా,తుమ్మలపల్లి రామసత్యనారాయణ , సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు, బిగ్ బాస్ విజేత కౌశల్, విశ్రాంత ఐఏఎస్ చింతల శ్రీనివాస్ లు చిత్రాన్ని చూసి దర్శకుడిని, చిత్ర బృందాన్ని సత్కరించారు. ఇలాంటి చిత్రాలను ఆదరించి నట్లయితే ఇలాంటి చిత్రాలు మరిన్ని వస్తాయని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. మనం కూడా ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని పిల్లలు సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదగాలి అని కోరుకుందాం.

 

Read more RELATED
Recommended to you

Latest news