మేల్కొన్న చైనా.. ఆ జంతువు మాంసంపై నిషేధం

-

కరోనా మహమ్మారి పుట్టుకకు చైనానే కారణమనే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు చైనీయుల ఆహారపు అలవాట్లే కారణమని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు జంతువుల నుంచి మానవులకు కరోనా వైరస్‌ సంక్రమించిందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనీయుల ఆహారపు అలవాట్లపై పలువురు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ ధోరణి భవిష్యత్తులో చైనాతో పాటు ప్రపంచానికి పెను ప్రమాదాలు తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో మేల్కొన్న ఈ నేపథ్యంలో డ్రాగన్‌ దేశం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కుక్క మాంసంపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. కుక్క మాంసం విక్రయాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. కుక్కలను ఆహారానికి ఉపయోగించకుండా, పెంపుడు జంతువులుగా చూడాలంటూ ఆదేశాలు జారీచేసింది. కుక్కలను కూడా మినహాయింపు జాబితాలో చేర్చింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలు జారీచేసింది. అయితే చైనాలో ఏటా రెండు కోట్ల దాకా కుక్కల్ని, 40లక్షల వరకు పిల్లులను ఆహారం కోసం చంపుతున్నట్టుగా నివేదికలు చెబుతన్నాయి.

ముఖ్యంగా చైనాలోని గ్యాంగ్జీ ప్రావిన్సులోని యులిన్ సిటీలో జూన్ 21 నుంచి 30 వరకూ ప్రత్యేకంగా కుక్క మాంసం పండుగనే నిర్వహిస్తారు. ఆ సందర్భంగా వేలాది కుక్కలను చంపి తింటారు. అయితే కరోనా విజృంభించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అడవి జంతువుల మాంసం విక్రయాల్ని వినియోగాన్ని చైనా ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత కుక్క, పిల్లి మాంసం అమ్మకాల్ని, వినియోగాన్ని నిషేధించిన మొట్ట మొదటి నగరంగా షెన్జెన్ అవతరించింది. ఈ క్రమంలో చైనా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news