గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని కలవరపెట్టిన చైనా రాకెట్ కుప్పకూలింది. చైనా నుండి నింగిలోకి దూసుకెళ్ళిన రాకెట్ ఫెయిలై, కనెక్షన్ కట్ అయ్యి ఎక్కడ పడుతుందో తెలియదంటూ వార్తలు రావడంతో ప్రపంచం మొత్తం గజగజ వణికింది. ఆస్ట్రేలియా, తుర్క్ మెనిస్తాన్ దేశాలపై పడే అవకాశం ఉందని వార్తలు షికారు చేసాయి. ఒక పక్క మన రాజధాని అయిన ఢిల్లీపై పడే అవకాశమూ ఉందని వినిపించింది. ఐతే తాజాగా చైనా రాకెట్ హిందూ మహాసముద్రంలో కుప్పకూలింది.
మాల్దీవ్స్, శ్రీలంకకి మధ్యలో హిందూ మహాసముద్రంలో ఈ రాకెట్ కుప్పకూలిందని చైనా వెల్లడించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. భారతదేశానికి సమీపాన హిందూ మహాసముద్రంలో కుప్పకూలిందని, భూ వాతావరవణంలోకి రాగానే ముక్కలు ముక్కలైపోయిందని, ఆ తర్వాత సరాసరి హిందూ మహాసముద్రంలో శకలాలు పడ్డాయని తెలిపింది. మొత్తానికి ఎక్కడ భూమిపై పడుతుందో అనుకుని భయాందోళనలకి గురైన జనాలు ఊపిరి పీల్చుకున్నారు.