చైనా తప్పుడు మాటలు మాట్లాడుతుందా…?

-

కరోనా వైరస్ విషయంలో చైనా తప్పుడు మాటలు మాట్లాడుతుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ ని చైనా ముందు నుంచి దాస్తునే వస్తుంది. అది ఒక పక్క ఆ దేశంలో విలయతాండవం చేస్తున్నా ఆ దేశం మాత్రం ఎప్పుడూ కూడా ప్రపంచానికి వాస్తవాలు చెప్పడం లేదు. వాస్తవానికి కరోనా వైరస్ తీవ్రతకు చైనా ఎక్కువగానే నష్టపోయింది. పెట్టుబడుల విషయంలో ఆ దేశం భయపడింది.

ఆ దేశంలో వ్యాపారవేత్తలు పెట్టుబడి పెట్టడానికి కరోనా దెబ్బకు వెనకడుగు వేసారు. అలాగే రష్యా నుంచి వచ్చే వ్యాపారవేత్తలు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. చైనా సన్నిహిత దేశాల నుంచి పెట్టుబడులు రాలేదు. దీనితో చైనా మరణాల విషయంలో వాస్తవాలు దాచింది అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేసామని గొప్పలు చెప్పుకునే ఆ దేశంలో మరణాల సంఖ్య… లక్ష వరకు ఉండవచ్చు అంటున్నారు.

ఇక వైరస్ ని దాచే విషయంలో కూడా చైనా ప్రభుత్వం ముందు నుంచి వివాదాస్పదంగానే వ్యవహరించింది. ఆ దేశానికి అది ఒకానొక దశలో శాపంగా మారినా సరే ఆ దేశం మాత్రం దాన్ని చాలా చిన్న సమస్యగా ప్రపంచానికి చూపించింది. కరోనా కారణంగా ఊహాన్ నగరంలోనే దాదాపు 60 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా ప్రసారం చేసింది. వాటిని చైనా తప్పుబట్టింది.

అన్ని దేశాలు కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ మీడియా చెప్పినా సరే దాన్ని చైనా తప్పుబట్టింది. నేడు ప్రపంచం ఇలాంటి పరిస్తితిలో ఉండటానికి చైనా పాలకులే కారణం. కరోనా వైరస్ ని ఆ దేశం సృష్టించి నష్టపోయి అమెరికాకు సన్నిహితంగా ఉండే దేశాల మీదకు వదిలింది. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ దేశాలు ఇలాగే ఇబ్బంది పడుతున్నాయి. కాని వాళ్ళు తీవ్రత గురించి తప్పుడు మాటలు మాత్రం మాట్లాడలేదు.

Read more RELATED
Recommended to you

Latest news