చైనా యుద్ధ కాంక్ష.. మరోసారి తైవాన్ పైకి యుద్ధ విమానాలు..

-

చైనా మరోసారి తన విస్తరణవాదాన్ని చూపించింది. తైవాన్ గగనతలంలోకి యుద్ద విమానాలు పంపి ఉద్రిక్తతలకు తెర లేపింది. గతేడాది సెప్టెంబర్ నుంచి చైనా తైవాన్ ను కవ్విస్తోంది. ఇదే వారంలో రెండు సార్లు చైనా, తైవాన్ ఎయిర్ ఢిపెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ లోకి విమానాలను పంపింది. తాజాగా 13 విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపింది. వీటిలో కంట్రోల్ (AEW&C) విమానం, మరియు ఆరు షెన్యాంగ్ J-16 మరియు రెండు చెంగ్డు J-10 ఫైటర్ జెట్‌లు ఉన్నాయి.

ప్రజాస్వామ్య తైవాన్ కూడా చైనాలో భాగమే అని చైనా వాదిస్తోంది. ప్రపంచ దేశాలు కూడా వన్ చైనా విధానానికి కట్టుబడాలంటూ హెచ్చిరిస్తోంది చైనా. తైవాన్ కు అండగా అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు నిలవడం చైానాకు మింగుడుపడటం లేదు. దీంతో తమ ఆధిక్యతను చూపించుకోవడానికి ప్రతీ సారి ఇలా తైవాన్ గగనతలంలోకి యుద్ధవిమానాలను పంపిస్తూ ఉద్రిక్తతలను రాజేస్తోంది. తన యుద్ద కాంక్షను బయటపెడుతోంది. గతంలో చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ కూడా తైవాన్ ను స్వాధీనం చేసుకోవడంతోనే చైనా పునరేకీకరణ పూర్తవుతుందని ప్రకటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news