రాజధాని వద్దని విశాఖ వాసులతోనే చెప్పిస్తారంట!!

-

అమరావతిలో మాత్రమే పూర్తి రాజధాని ఉండాలనేది టీడీపీ నేతల మాట! మేము అక్కడే పెట్టుబడులు పెట్టాము.. మేము అక్కడే గ్రాఫిక్స్ పూర్తి చేశాము.. మేము అక్కడే భూముల విషయంలో చేయాల్సిందంతా చేశాము అనేది వారి మాటగా ఉంది! అయితే జగన్ మాత్రం… మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అమావతి ప్రాంతంతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అభివృద్ధి చెందేలా పరిపాలనా వికేంద్రీకరణకు సిద్ధపడిన సంగతి తెలిసిందే! ఈ విషయంలో బాబు చేయలేని ధైర్యం ఒకటి తాను చేస్తానంటూ సవాల్ విసురుతున్నారు అయ్యాన్నపాత్రుడు!

అవును… అమరావతిలోనే రాజధాని ఉండాలనే విషయంలో కనీసం గుంటూరు – కృష్ణా జిల్లాలో రెఫరెండం పెడదామన్న మాట చంద్రబాబు చెప్పిన దాఖళాలు లేవు! కానీ… విశాఖలో రాజధాని ఉండాలా వద్దా అన్న విషయంలో విశాఖ ప్రజలనే అడుగుదాం అంటున్నాడు అయ్యన్నపాత్రుడు! ఈ మేరకు జగన్ కు సవాల్ విసిరారు అయ్యన్న!

అవును.. రాజధాని అంశంపై విశాఖ లోక్‌ సభ స్థానానికి ఉప ఎన్నిక పెట్టి తేల్చుకుందామా? అని టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వైసీపీకి సవాల్‌ చేశారు. “విశాఖ ఒక్క చోటే ఉప ఎన్నిక కు వెళ్దాం. విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజల ఉద్దేశమేమిటో తెలిసిపోతుంది. సవాల్‌కు నేను సిద్ధం. మీరు సిద్ధమా?” అని ప్రశ్నించారు అయ్యన్న!

దీంతో ఇదేదో బాగానే ఉంది అనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి! విశాఖ లోక్ సభ స్థానానికి ఎప ఎన్నిక పెట్టి… విశాఖలో ఏపీ పరిపాలనా రాజధాని ఉంచాలా వద్దా అన్న విషయం విశాఖ ప్రజలనే అడిగితే సరిపోతుంది కదా!! ఇక్కడ టీడీపీ నేతలు చెప్పేది ఏమిటంటే… విశాఖలో రాజధాని వద్దని విశాఖ ప్రజలతోనే చెప్పిస్తామని!! ఇంతకు మించిన హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉంటుందా?

అంటే… అయ్యన్న దృష్టిలో విశాఖ వాసులెవరూ వారి ప్రాంతంలో పరిపాలనా రాజధాని కోరుకోవడం లేదా? మళ్లీ ఉప ఎన్నికలు పెట్టి మరీ ఈ విషయం ప్రజలు చెప్పాలా? నాలుగు రోజులు ఆగితే ఎలాగూ స్థానిక సంస్థల ఎన్నికలు రానే వస్తాయి! అప్పుడు తేలిపోతుందిగా… నిజంగా విశాఖ ప్రజల అభిప్రాయం ఏమిటనేది! అప్పటివరకూ అయ్యన్న టీడీపీలోనే ఉంటే.. కచ్చితంగా విశాఖ ప్రజల అభిప్రాయం ఘనంగానూ ఘాటుగానే చెబుతారనేది వారి మాటగా ఉంది!

– Ch Raja

Read more RELATED
Recommended to you

Latest news