నవంబర్ 5న కూడా స్కూల్స్ తెరవద్దు : ఎమ్మెల్యే అనగాని

-

రాష్ట్రంలో స్కూళ్లు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ అన్నారు. వైసీపీ మంత్రులే కరోనా కి భయపడి ఇళ్ళలో ఉంటే విద్యార్థులు పాఠశాలకి ఎలా వస్తారు? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయన్న ఆయన వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులే కరోనా భారినపడి పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ప్రవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. మిగతా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా కి భయపడి ఇంటి నుంచి భయటకు రావడం లేదని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ఉంటే నవంబర్ 5 నుంచి పాఠశాలలు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదని ఆయన అన్నారు.

జగనన్న విద్యా కానుక పేరుతో ప్రచార ఆర్భాటం కోసం విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలని ఆయన కోరారు. పాఠ్య పుస్తకాలు, విద్యా కానుక వంటి వాటిని నేరుగా విద్యార్థుల ఇళ్లకెళ్లి అందజేసేలా ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన సలహా ఇచ్చారు. రాష్ట్రంలో సుమారు 200 మంది విద్యార్థులు కరోనా బారిన పడడం బాధాకరమన్న ఆయన ప్రభుత్వం వారికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గకున్నా స్కూళ్లు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు భయంతో, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో ఉన్నారని విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news