ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `సైరా నరసింహారెడ్డి` పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎడిటింగ్ టేబుల్ మీదున్న సినిమా 3.30 గంటల నిడివితో వస్తోందని సమాచారం. రఫ్ కటింగ్ అనంతరంగా ఇంత నిడివి వచ్చినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో దర్శక, హీరోలకు సైరా సవాల్ గా మారిందని సమాచారం. మూడున్నర గంటలతో ప్రేక్షకుడిని థియేటర్ లో కూర్చోబెట్టడం అంటే చిన్న విషయం కాదు. సినిమా ను ఎంతో అద్భుతంగా తీస్తే గానీ అలాంటి సాహసాలు కలిసిరావు. బాహుబలి లాంటి సినిమా విషయంలో రాజమౌళి తర్జన భర్జన పట్టాడు. చాలా సన్నివేశాలకు కత్తెర వేసి చివరిగా మూడు గంటల నిడివితో సిద్దం చేసారు.
ఇప్పుడు చిరు-సూరి కూడా అదే చేయాలనుకుంటున్నారుట. సినిమా మొత్తం చూసి ల్యాగ్ ఎక్కడెక్క డ ఉందో చూసుకుని ఎడిట్ చేయాలని చూస్తున్నారుట. గ్రాఫిక్స్ సన్నివేశాలు కూడా తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా చిరంజీవి నేరుగా రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి నటించిన కొన్ని డ్రామా నేపథ్యం గల సినిమాలకు ఇలాంటి సమస్యే ఎదురైంది. ఆ సమయంలో దర్శకులు చేతులెత్తేసినా చిరు సలహాలు తీసుకుని 2.30 గంటల కుదించారు. ఇప్పుడు సూరి కూడా చిరు సూచనలు, సలహాలతోనే ముందుకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.
అలాగే చరణ్ కూడా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ను సైతం వాయిదా వేసుకుని సైరా కోసం కొన్ని రోజులు కేటాయించనున్నాడుట. అవసరమైతే రాజమౌళి సలహాలు కూడా తీసుకుందామని సూరికి సూచించాడుట. అయితే సైరా కథ బయోపిక్ కాబట్టి కాబట్టి సన్నివేశాలను తొలగించడం అంత ఈజీ కాదు. ప్రతీ సన్నివేశానికి ఇంటర్ లింక్ కచ్చితంగా ఉండాలి. సీన్ సింకింగ్ లేదంటే…కథ మరోలా ఉంటుంది. వీటన్నటింని దృష్టిలో పెట్టుకుని ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. మరి చిరు ఎడిటింగ్ వెర్షన్ ఎలా ఉంటుందో కొన్ని రోజులు ఆగితే గానీ క్లారిటీ రాదు.