మెగా కుటుంబానికి ఓ తండ్రిలా చిరంజీవి అండగా ఉండేవారట. ఆ సమయంలో ఒకానొక సందర్భంలో చిరంజీవి.. నాగబాబు చెంప చెల్లుమనిపించిన విషయాన్ని ఈసందర్భంగా నాగబాబు చెప్పారు.
ప్రపంచ తండ్రుల దినోత్సవం సందర్భంగా సినిమా సెలబ్రిటీలంతా తమ నాన్నలను ఓసారి గుర్తు చేసుకున్నారు. అయితే.. మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ఫాదర్స్ డే సందర్భంగా.. తనకు తండ్రిలాంటి వ్యక్తి అయిన తన అన్న చిరంజీవితో తనకు ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు.
తన నాన్న తర్వాత తనకు అంత అనుబంధం ఉన్న వ్యక్తి చిరంజీవే అట. మెగా కుటుంబానికి ఓ తండ్రిలా చిరంజీవి అండగా ఉండేవారట. ఆ సమయంలో ఒకానొక సందర్భంలో చిరంజీవి.. నాగబాబు చెంప చెల్లుమనిపించిన విషయాన్ని ఈసందర్భంగా నాగబాబు చెప్పారు.
నేను ఏడో తరగతి చదువుతున్న సమయంలో అన్న(చిరంజీవి) ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఓరోజు అన్న లాండ్రీకి వెళ్లి బట్టలు తీసుకురావాలని నాకు చెప్పాడు. చెప్పి అన్న ఏదో పనిమీద బయటికి వెళ్లాడు. అయితే.. అన్న చెప్పిన పనిని నేను మరిచిపోయా. అన్న పని చెప్పిన విషయాన్ని మరిచిపోయా. అన్న వచ్చి లాండ్రీకి వెళ్లలేదా అని అడిగాడు. భయపడ్డా. కోపంతో.. చెప్పిన పని చేయవా అంటూ నా చెంప చెల్లుమనిపించాడు. దీంతో వెంటనే మా నాన్నకు ఈ విషయాన్ని చెప్పా. అన్న నన్ను కొట్టాడని ఫిర్యాదు చేశా. నాన్న కూడా అన్నకు సపోర్ట్‌గానే మాట్లాడాడు.
ఇంట్లో అన్నే పెద్ద కావడంతో అన్న ఏది చెబితే అదే చేయాలని నాన్న కూడా చెప్పేవారు. కానీ.. ఆరోజు నుంచి అన్న ఇప్పటి వరకు నన్ను ఒక్కమాట కూడా అనలేదు. ఆయన నాపై చేయి చేసుకోవడం అదే ఆఖరు. అప్పటి నుంచి పవన్‌ను, నన్ను ఒక్క మాట కూడా అనకుండా.. ఎంతో ప్రేమగా చూసుకున్నాడు.. అని నాగబాబు తన గతాన్ని నెమరువేసుకున్నారు.