మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం : చిరు

-

ఈ రోజు(ఏప్రిల్‌ 8) పుట్టిన రోజు జరుపుకుంటున్న అల్లు అర్జున్‌, అఖిల్‌ అక్కినేని, అకీరా నందన్‌లకు  మెగాస్టార్‌ చిరంజీవి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలియజేశారు. మొదట స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన చిరు.. ‘చిన్నపుడే బన్నీ డ్యాన్స్‌లో గ్రేస్‌ ఉంది. బన్నీలోని కసి, కృషి నాకు చాలా ఇష్టం, హ్యాపీ బర్త్‌ డే అల్లు అర్జున్‌.. నువ్వు బాగుండాలబ్బా’ అని పేర్కొన్నారు. చిన్నతనంలో బన్నీ డ్యాన్స్‌ చేస్తున్న ఓ అరుదైన ఫొటోను కూడా చిరు పోస్ట్‌ చేశారు.

మరోవైపు తన సోదరుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కుమారుడు అకీరా నందన్‌కు కూడా మెగా‍స్టార్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అకీరా హైట్‌కు సంబంధించి చిరు ఫన్నీగా ట్వీట్‌ చేశారు. ‘మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6’4″) అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి. విష్‌ యూ ఏ ‘పవర్‌’ ఫుల్‌ ప్యూచర్‌. హ్యాపీ బర్త్‌ డే అకీరా’ అని మెగాస్టార్‌ ట్వీట్‌ చేశారు. చిన్నప్పుడు అకీరాను ఎత్తుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

చరణ్‌కి ఓ తమ్ముడు..
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అక్కినేని హీరో అఖిల్‌కు కూడా చిరు విషెస్‌ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్‌డే అఖిల్‌.. చరణ్‌కు ఒక తమ్ముడు, సురేఖకి నాకు కొడుకుతో సమానం. మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌, అలాగే అందరు ఇష్టపడే కిడ్‌. నీకు అంతా మంచే జరగాలి’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news