అల్లు అర్జున్ సుకుమార్ ల “పుష్ప” సినిమా మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రష్మిక మందన్న ..!

-

అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ వాస్వంగా అయితే ఏ.ఆర్.మురగదాస్ సినిమాలో నటించాలి. ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు ముగిశాయి. అంతేకాదు గజనీ కి సీక్వెల్ ని మురగదాస్ అల్లు అర్జున్ తో తీయబోతున్నాడన్న ప్రచారం కూడా జరిగింది. కాని ఈ సినిమా మాటల దగ్గరే ఆగిపోయింది. ఇక గీత గోవిందం లాంటి 100 కోట్ల వసూళ్ళు సాధించే సినిమాని తీసిన పరశురాం తో కూడా బన్ని సినిమా ఉంటుందన్న టాక్ కూడా వచ్చింది. అది గాసిప్ గానే మిగిలింది. వీళ్ళతో పాటు విక్రం కె. కుమార్ కూడా బన్నీ కోసం కథ రెడీ చేశారని వీళ్ళ కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందన్న మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

 

కాని వీళ్ళందరిని పక్కన పెట్టి అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలోలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. కాసేపటి క్రితమే ఈ సినిమా టైటిల్ తో పాటు బన్నీ లుక్ ని కూడా రివీల్ చేశారు. ఊరమాస్ లుక్ లో చూడగానే మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యోలా అదిపోయింది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప అనే టైటిల్ ని ఖరారు చేస్తూ రివీల్ చేశారు. ఈ టైటిల్ కి బన్నీ లుక్ కి ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

ఇక పుష్ప సినిమా పాన్ ఇండియ రేంజ్ లో తెరకెక్కుతోంది అంటూ స్వీట్ సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు అల్లు అర్జున్ సుకుమార్ బృందం. పుష్ప టైటిల్ లోగోని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాల భాషల్లోనూ రిలీజ్ చేసి ఇది పాన్ ఇండియా సినిమా అని క్లారిటి ఇచ్చారు. దీంతో బన్ని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు ఫిల్మ్ నగర్ లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటిస్తున్న హీరోయిన్ రష్మిక మందన్న పుష్ప పోస్టర్ చూసి బాగా ఎగ్జైట్ అయింది. ఈ సినిమా ష్యూర్ గా బ్లాక్ బస్టర్ అంటూ ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినందుకు అల్లు అర్జున్ సుకుమార్ లకి స్పెషల్ థ్యాంక్స్ అంటూ అలాగే అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ ని తెలిపింది. అంతేకాదు ఇదొక మ్యాజికల్ మూవీ అంటూ బన్నీ లుక్ ఇలా ఉంటుందని ఊహించలేదంటూ తన సన్నిహితుల దగ్గర చెబూతు ఉబ్బి తబ్బిబైపోతుందట.

Read more RELATED
Recommended to you

Latest news