చంద్రబాబుకి గొప్పగా శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి…!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ సినీ ప్రముఖులు ఆయన శుభాకాంక్షలు చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు నాయుడు కి కాస్త ప్రత్యేకంగా చెప్పారు. అహర్నిశం ప్రజా సేవలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మీ సంకల్పబలం అనితరసాధ్యం. కలకాలం మీకు సంతోషం, ఆరోగ్యం ప్రసాదించమని ఆ భగవంతుని కోరుతున్నాను.

మీకు 70 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు సర్. మీ దూర దృష్టి, మీ కృషి, మీ అంకితభావం ఆదర్శప్రాయమైనవి. అని ట్వీట్ చేసారు చిరంజీవి. అలాగే ఏపీ సిఎం జగన్ కూడా చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంగా ,సంతోషంగా ఉండాలి అని ఆకాంక్షించిన సీఎం జగన్ శుభాకాంక్షలు చెప్పారు. అయితే చిరంజీవి ట్వీట్ మీద ఇప్పుడు కొన్ని చర్చలు జరుగుతున్నాయి.

ఆయన అలా ఎందుకు అంత గొప్పగా ట్వీట్ చేసారు అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆయన అభిమానులు వేడుకలకు దూరంగా ఉన్నా పలు చోట్ల అన్నం ప్యాకెట్ లను పేదలకు పంచుతున్నారు. ఇక రక్తదానం చేసే వాళ్ళు స్వచ్చందంగా వెళ్లి చేస్తున్నారు. అదే విధంగా ఇంట్లో చంద్రబాబు కుటుంబం తో కలిసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news