అందరికీ అభిమానులు ఉంటే.. పవన్‌కు భక్తులున్నారు: చిరంజీవి

-

సాధారణంగా నటులకు అభిమానులంటారు కానీ నా తమ్ముడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాత్రం భక్తులున్నారని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. గాయని స్మిత హోస్టుగా  ‘నిజం’  కార్యక్రమంలో పాల్గొన్న చిరు.. పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

నటుడిగా, రాజకీయనాయకుడిగా పవన్‌ మీకెలా ఇష్టం? అని ప్రశ్నించగా, ‘‘పవన్‌కల్యాణ్‌ సహజ శైలిని బట్టి చూస్తే రాజకీయ నాయకుడిగానే నాకు ఇష్టం. బాధలకు స్పందించే తీరు, సాయం చేయాలన్న గుణం చిన్నప్పటి నుంచే అతనిలో ఉంది. ఒకానొక సందర్భంలో నక్సల్స్‌లోకి వెళ్లిపోతాడేమోననిపించింది. తుపాకులతో ఆడుకునేవాడు. నేను సింగపూర్‌ షూటింగ్స్‌కు వెళ్లేటప్పుడు ‘అక్కడి నుంచి ఏం తీసుకురాను’ అని అడిగితే, ‘ఇక్కడ మంచి గన్స్‌ దొరకడం లేదు. అక్కడి నుంచి తీసుకురా అన్నయ్యా’ అని చెప్పేవాడు. డమ్మీ గన్స్‌ అయినా, అవి సెమీ ఆటోమేటిక్‌. ఆ తుపాకులు పట్టుకుని తిరుగుతుంటే రైల్వేస్టేషన్‌లో ఆపేశారు. డమ్మీ తుపాకులని తెలిసి వదిలేశారు. అతడికి ఉన్న కల్ట్‌ ఇమేజ్‌ పూర్తిగా భిన్నమైనది. అందరికీ అభిమానులు ఉంటారు. పవన్‌కు భక్తులున్నారు’ అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news