ఆ సినిమా ఫ్లాప్…​ భరించలేక ఏడ్చేసిన చిరంజీవి

-

మెగాస్టార్​ చిరంజీవి నటించిన ‘ఖైదీ’ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతటి విజయం తర్వాత రాబోయే మరో చిత్రం కూడా అదే స్థాయిలో హిట్‌ అవుతుందని భావించారట చిరు. అదే ‘వేట’. కానీ ఫలితం తారుమారైంది. దాంతో బాగా ఏడ్చేశానని ఓ సందర్భంలో తెలిపారు మెగాస్టార్.

‘వేట’ విడుదలయ్యాక బాగా ఏడ్చేశా. ‘ఖైదీ’ తర్వాత విడుదలైన చిత్రం కావడం వల్ల ‘వేట’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కాకపోతే ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. దాంతో ఇంట్లో కూర్చొని బాధపడ్డా.”-మెగాస్టార్​ చిరంజీవి
అలాగే, ‘విజేత’ సినిమా ఎప్పుడు చూసినా తనకు కన్నీళ్లు వచ్చేస్తాయని వివరించారు చిరు. అంతేకాదు తన ఆటోబయోగ్రఫీ రాసి కొందరిలోనైనా స్ఫూర్తి నింపాలని ఉందని వెల్లడించారు.

చిరంజీవి
చిరంజీవి

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో ఒకటి గాడ్ ఫాదర్. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సత్యదేవ్, సునీల్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. సౌత్ లేడీసూపర్ స్టార్ నయనతార ఫీమేల్ లీడ్ రోల్ లో కనిపించనుంది. ప్రస్తుతం సినిమా డబ్బింగ్ పనులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చిరంజీవితో స్టెప్పులు వేయించారు.

గాడ్ ఫాదర్
గాడ్ ఫాదర్

మరోక సినిమా భోళా శంకర్‌. చిరు – కీర్తి సురేశ్‌ అన్నా చెల్లెళ్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తమిళంలో సూపర్‌హిట్‌ సొంతం చేసుకున్న ‘వేదాళం’ రీమేక్‌గా ‘భోళా శంకర్‌’ రూపుదిద్దుకుంటోంది. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌తో ఇది తెరకెక్కుతోంది. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

భోళా శంకర్
భోళా శంకర్

చిరంజీవి-రవితేజ కలిసి నటిస్తోన్న చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఇప్పటి తరం హీరోలతో ఏమాత్రం తగ్గకుండా పోటీపడుతున్న మెగాస్టార్ చిరంజీవి మరిన్నీ చిత్రాలతో విజయాలు పొందాలని కోరుకుందాం.

వాల్తేరు వీరయ్యా
వాల్తేరు వీరయ్యా

Read more RELATED
Recommended to you

Latest news