రాజమండ్రి హోమియోపతి మెడికల్ కళాశాలలో అల్లు రామలింగయ్య విగ్రహా విష్కరణ చేశారు మెగా స్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కర వ్యాఖ్యలు చేశారు. నటుడిగా తాను జన్మించింది రాజమండ్రిలోనేనని.. తన మొదటి మూడు సినిమాలు రాజమండ్రి ప్రాంతంలో చిత్రీకరణ జరిగాయని చెప్పారు. తనది అల్లు రామలింగయ్య గారిది గురు – శిష్యుల సంబంధమన్నారు. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కడుపులో మంట వచ్చేదని వెల్లడించారు.
ఎన్ని యాంటాసిడ్లు వాడినా తన కడుపులో మంట తగ్గలేదని.. అల్లు రామలింగయ్య గారు ఒకసారి ఇచ్చిన హోమియో మందుతో నొప్పి తీసినట్లు పోయిందన్నారు. ఇవాళ్టికీ మా ఫ్యామిలీ హోమియోపతి మందులే వాడతామని.. హోమియోపతిలో తగ్గని జబ్బు లేదన్నారు. రాజ్యసభ ఎం.పి.గా ఉండటం వల్లే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి నిధులు ఇవ్వగలిగానని పేర్కొన్నార చిరు.. సంజీవని లాంటి హోమియోపతి వైద్యం చిరంజీవిగా ఉండాలని వెల్లడించారు. హోమియోపతి సైడ్ ఎఫక్ట్స్ లేని వైద్యమని హోమియోపతి వైద్యానికి మరింత ప్రాచుర్యం రావాలని పేర్కొన్నారు చిరంజీవి