మోహన్ బాబు కు చిరంజీవి ఫోన్ !

-

డైలాగ్‌ కింగ్‌ మోహన్‌ బాబుకు మెగాస్టార్‌ చిరంజీవి ఫోన్‌ చేశారు. మా అసోషియేషన్‌ ఎన్నికల్లో తాను ఎవరికీ కూడా మద్దతు ఇవ్వ లేదని మోహన్‌ బాబు కు మెగాస్టార్‌ చిరంజీవి చెప్పినట్లు సమాచారం అందుతోంది. అ కారణం గా తన పేరు బయటకు వచ్చిందని మోహన్‌ బాబు చిరంజీవి స్పష్టం చేశారు. ఎప్పటి లాగానే మన స్నేహ బంధం కొనసాగిందని ఫోన్‌ లో చిరంజీవి చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే.. చిరంజీవి వ్యాఖ్యల పై స్నేహపూర్వకంగా మోహన్‌ బాబు కూడా స్పందించారు. అందరం కలిసి కట్టుగా ఉండాలన్నదే తన అభిప్రాయం అని మోహన్‌ బాబు చెప్పారు. ఇక ముందు మా అసోషియేషన్‌ అభివృద్ధికి తోడ్పాడుతామని ఇద్దరూ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కాగా… అక్టోబర్‌ 10 వ తేదీన జరిగిన మా అసోషియేషన్‌ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలు తీవ్ర వివాదానికి తెరలేపాయి. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ కు చిరంజీవి సపోర్ట్‌ ఉందని… వార్త చానెళ్లలోనూ వార్తలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news