చిరంజీవి పవన్ లేకపోతే నాగబాబు ఏంటి..? కోటా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్..!

-

మా ఎన్నికలకు ముందు కోటా శ్రీనివాసరావు ప్రకాష్ రాజ్ సమయానికి షూటింగ్లకు రాడంటు మంచు విష్ణుకు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కోటా మనిషి కాదని జంతువు అంటూ వ్యాఖ్యానించారు. వయసు పెరిగిన కొద్దీ కోటా కు చాదస్తం పెరుగుతుంది అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కోట శ్రీనివాసరావు ప్రకాష్ రాజ్ కాలి గోటికి కూడా సరిపోడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు చేసిన వ్యాఖ్యలపై కోట శ్రీనివాసరావు స్పందించారు.

తాను నాగబాబును అసలు ఏమీ అనలేదు అని అన్నారు. ప్రకాష్ రాజ్ నిజంగానే షూటింగ్లకు సమయానికి రాడని…ఉదయం 9 గంటలకు షూటింగ్ ఉంటే 11 గంటలకు వస్తారు అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా “మా” లోనే అతడిపై గతంలో ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఎవరి టాలెంట్ వాళ్లకు ఉంటుందని ప్రకాష్ రాజ్ ను నటన పరంగా నటన పరంగా తాను ఎప్పుడూ అనలేదని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ చిరంజీవి లేకపోతే అసలు నాగబాబు ఏంటి అంటూ ప్రశ్నించారు. నాగబాబు ఏమైనా గొప్పనటుడు అనుకుంటున్నాడా అంటూ కోట ఫైర్ అయ్యారు. మా లో ఉన్న నాగబాబు తో ఒరిగింది ఏమీ లేదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news