పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి తీసుకురావాలన్న ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో.. చిరంజీవి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరింత వివాదాస్పదంగా మారేలా చేస్తున్నారు. ఇకపోతే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ అందుకొని.. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాతో జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాను డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. తనపై వస్తున్న కామెంట్స్ గురించి రియాక్ట్ అయ్యారు చిరంజీవి.
పొరుగు రాష్ట్ర రాజకీయాల గురించి నాకెందుకు అని కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై స్పందించారు.. ఆ రాజకీయాలు తనకు వద్దంటూ అసలు విషయం పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాకు ఏపీ పాలిటిక్స్ కు సంబంధం లేదు.. అక్కడ ఏం జరుగుతుందో పేపర్ల ద్వారా మీకు ఏం తెలుస్తుందో.. మీరు ఏం పరిశీలిస్తారో.. అంతకంటే తక్కువగా నేను పేపర్ చూస్తాను.. నా ఇంటికి పేపర్ కూడా రాదు.. నా ఫోకస్ మొత్తం సినిమా పైనే.. రాజకీయాల గురించి పట్టించుకోను. నాకు ఓటు హక్కు ఎక్కడైతే ఉందో ఆ రాష్ట్రంలో ఉండే మాట్లాడుతున్నాను.. కాబట్టి నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. అక్కడ ఏం జరుగుతోంది అని తెలుసుకోవాలన్న కుతూహలం కూడా లేదు.. నేను రాజకీయాలకు బహు దూరంలో ఉంటాను.
పవన్ కళ్యాణ్ రాజకీయాల వెనుక నా హస్తము ఉందని చాలామంది అంటూ ఉన్నారు. కానీ నేను చాలాసార్లు ఇప్పటికే క్లియర్ చేస్తూ వచ్చాను. నేను పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కావాలని అనుకోవడం లేదు.. రాజకీయాల విషయంలో నేను తన వెనుక లేను అంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి.