చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..ఇండస్ట్రీ పెద్దగా ఉండను.. అనవసర పంచాయతీలు నాకొద్దు..

-

మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు సినీ ఇండస్ట్రీల్లో హెల్త్ కార్డుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. అయితే దాసరి నారాయణ రావు తరువాత సిని ఇండస్ట్రీలో పెద్దగా ఎవరూ లేరని.. మీరు ఆ బాధ్యత తీసుకుంటే భరోసాగా ఉంటుందని అక్కడ ఉన్నవారు కోరగా.. చిరంజీవి స్పందించారు.

చిరంజీవి మాట్లాడుతూ… పెద్దరికం, హోదా అనేవి తను ససేమిరా ఇష్టం లేదని, నేను పెద్దగా ఉండను, ఇండస్ట్రీ పెద్ద అని అనిపించుకోవడం తను పెద్ద ఇబ్బంది అని అన్నారు. బాధ్యత కలిగిన ఓ బిడ్డగా ఉంటానిని అన్నారు. అవసరం వచ్చినప్పుడూ..నేను ఉన్నానంటూ ముందుకు వస్తానని స్పష్టం చేశారు. అనవసరమైన వాటికి ప్రతీదానికి తగుదునమ్మ అంటూ ముందుకొచ్చే ప్రసక్తే లేదని అన్నారు. అవసరం వచ్చినప్పుడు సంక్షోభంలో తాను తప్పకుండా ఉంటానన్నారు. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే.. అటువంటి గొడవలను తీర్చనని అన్నారు. రెండు యూనియన్ల మధ్యనో, ఇద్దరు వ్యక్తుల మధ్యనో పంచాయతీ చేయాలంటే చేయను అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news