బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడపడుచులందరికీ బోనాలు పండుగ శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు చిరంజీవి. తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు అని స్పష్టం చేశారు. వర్షాలు బాగా కురవాలని, పాడిపంటలు వృద్ధి చెందాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు చిరంజీవి. ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నానని ట్విట్టర్ లో చిరంజీవి వెల్లడించారు.
కాగా…ఆషాఢ మాసం రావడంతో హైదరాబాద్ మహానగరంలో బోనాల పండుగ సందడి మొదలైంది. ఆదివారం నాడు గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో.. భాగ్యనగరంలో బోనాల పండుగ షురూ అవుతుంది. గోల్కొండ బోనాలు ముగిసిన తర్వాత వారం లష్కర్, లాల్‌దర్వాజా మాతామహేశ్వరి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, షాలిబండ అక్కన్న మాదన్న మహంకాళి, ధూళ్‌పేట, బల్కంపేట, పాతబస్తీ అమ్మవారి ఆలయాల్లో నెలంతా ఈ బోనాల పండుగ జరుపుకోనున్నారు.
బోనాలపండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు.తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు.వర్షాలు బాగా కురవాలని,పాడిపంటలు వృద్ధి చెందాలని,అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను pic.twitter.com/6VHLyoRw6R
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 11, 2021