చిరంజీవి: వాల్తేరు వీరయ్య,బాస్ ఈజ్ బాక్.!

-

చిరంజీవి ఈ పేరు తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తన సొంత టాలెంట్, కష్టంతో తెలుగు సినిమా పరిశ్రమ లో నంబర్ వన్ గా ఎదిగిన ధీరుడు. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి సినిమాకు దూరం అయ్యారు. మళ్లీ తప్పు తెలుసుకొని వరసగా సినిమాల్లో నటిస్తూ ఉన్నాడు.

దసరా పండుగకు వచ్చిన తన సినిమా గాడ్ ఫాదర్ చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కు చేరలేదని , ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. ప్రస్తుతం చిరంజీవి బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమా లో హీరో రవితేజ కూడా ఒక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ అవ్వబోతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన పాటలు ఆకట్టుకుంటున్నాయి.

ఇక పూనకాలు లోడింగ్ సాంగ్ లో చిరు స్టయిల్ సూపర్ గా ఉంది. చాలా రోజుల క్రితం  వచ్చిన తన సినిమాలు జై చిరంజీవ, అందరివాడు, ఠాగూర్ లలో డాన్స్ చేసిన మెగాస్టార్ అయితే మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్స్ కళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యారని చెప్పాలి.డాన్స్, ఎనర్జీ వరకు పాత మెగాస్టార్ కనిపిస్తున్నారు. ఇక సినిమాలో కామెడీ టైమింగ్ ఉంటే బొమ్మ అదుర్స్ అని మెగా ఫ్యాన్స్  ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news