ఆరోగ్యంగా ఉండాలంటే.. కడుపునిండా తింటే సరిపోదు.. ఆ తినేది పోషకాలతో నిండి ఉండాలి.. మనం ఏం తిన్నా.. అది మన ఆరోగ్యానికి మేలు చేసేదై ఉండాలి. కానీ మనం తినడం తింటాం కానీ..అందులో 50 శాతం కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవి ఉండేవి.. అన్ని ఫాస్ట్ ఫుడ్స్.. ఇంట్లో వండినవి తిందామన్నా.. అవి అన్నీ మనం బయట నుంచి కొన్నవే.. ఈరోజుల్లో కల్తీ దందా బాగా ఎక్కువైపోయింది.. పాలు, నీళ్లు, ఆవాలు, ధనియాలు కల్తీకి కాదేది అనర్హం.
అయితే మీ అందరికీ బెల్లం, పుట్నాలు కలిపి తినే అలవాటు ఉండే ఉంటుంది. మన చిన్నప్పుడు తినేవాళ్లం.. పోనూ పోనూ అని కనుమరుగైపోయింది. బెల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజు కొంచెం బెల్లం ముక్క తింటే ఎంతో మంచిది.. పల్లీలు, బెల్లం కలిపి తింటే బోలెడు లాభాలు ఉన్నాయట.. అవేంటో చూద్దామా..!
రోజూ ఒక గుప్పెడు పల్లీలను తిన్న తరువాత చిన్నం బెల్లం ముక్కను తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం అనంతరం తింటే.. అనేక ప్రయోజనాలను పొందవచ్చు. పల్లీలు, బెల్లం కలిపి రోజూ తినడం వల్ల శరీరానికి ఐరన్ బాగా లభిస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. మహిళలు రక్తహీనతతో ఎక్కువగా బాధపడుతుంటే..రోజూ ఇలా పల్లీలు, బెల్లం తింటే మంచిది. దీంతో రక్తం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. రక్తహీనత ఉండదు. ఇక ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తంలో ఉండే వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు పోతాయి. దీంతో ఇన్‌ఫెక్షన్లు, రక్త సంబంధ వ్యాధులు రావు.
రక్తం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. పల్లీలు, బెల్లం కలిపి తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. దీంతోపాటు రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు కూడా పోతాయి. దీనివల్ల బీపీ తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రావు. హార్ట్ ఎటాక్‌లు వచ్చే ప్రమాదం ఉండదు. ఇక ఈ మిశ్రమాన్ని రోజూ తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సీజనల్ వ్యాధులైన దగ్గు, జలుబు, జ్వరం నుంచి.. ఇతర రోగాల నుంచి బయట పడవచ్చు. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. మెదడు కూడా ఉత్తేజంగా మారుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
వైరల్, బాక్టీరియల్ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అలాగే చర్మం అయితే మరింత కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని రోజూ పిల్లలకు ఇవ్వడం వల్ల వారు రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. చదువుల్లో, క్రీడల్లో రాణిస్తారు. పెద్దలు తింటే రోజంతటికీ కావల్సిన శక్తి వస్తుంది. ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉండేవారు.. ఉదయాన్నే పల్లీలు, బెల్లం మిశ్రమాన్ని తింటే.. శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు.
ఇవి రెండూ పెద్ద ఖర్చేం కాదు.. మనం కొనగలివే.. తినగలిగేవే.. అయితే బెల్లం కొనేప్పుడు మాత్రం చూసి మంచిది తీసుకోవాలి. బెల్లంలో వ్యర్థాలు ఎక్కువగా ఉంటాయి.. ఖరీదైనది తీసుకుంటే ఈ వ్యర్థాలు అంతగా ఉండవు. మహిళలకే ఎక్కువ రక్తహీనత సమస్య ఉంటుంది. కాబట్టి..మీరు ఈ టిప్ డైలీ ఫాలో అయితే మార్పు త్వరలోనే గమనించవచ్చు. అయితే బెల్లం డైలీ తింటుంటే.. వాటర్‌ను కూడా అలాగే తీసుకోవాలి. లేదంటే బాడీ హీట్ అవుతుంది.