టాలీవుడ్ డైరెక్టర్లకు చిరంజీవి సీరియస్ వార్నింగ్

-

టాలీవుడ్ డైరెక్టర్లకు చిరంజీవి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. . అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా తెలుగు ట్రైలర్ ను విడుదల చేసారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. షూటింగ్ స్పాట్‌కు వచ్చాక డైరెక్టర్లు డైలాగులు రాసిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చిరు. ఇది నటులకు ఇబ్బందిగా ఉంది.. నాకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని గుర్తు చేశారు మెగాస్టార్‌.

ముందే స్క్రిప్ట్ ఇస్తే ఫెర్ఫార్మెన్స్‌పై దృష్టి పెడతారు.. టాలీవుడ్ డైరెక్టర్లు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు చిరంజీవి. క్లాప్స్‌, జేజేలు కొట్టే సినిమాలు మాత్రమే చేస్తానన్నారు చిరంజీవి. అమీర్ ఖాన్ చేసే క్యారెక్టర్ లు నాకు వస్తె నేను చెయ్యనని… ఏమి చేస్తే క్లాప్ కొడతారు … జే జే లు కొడతారు అనేది నేను చూస్తానని వెల్లడించారు.

కానీ అప్పుడప్పుడు నా ప్రమేయం లేకుండా కొన్ని వస్తాయని… అమీర్ ఖాన్ నడక, నడవడిక అంటే నాకు చాలా ఇష్టమని తెలిపారు. అమీర్ ఖాన్ లాగా మేం చేయాలనుకుంటాం, మాకున్న లిమిట్స్ వల్ల చేయలేకపోతున్నామని చెప్పారు. స్క్రిప్ట్ మీద అవగాహన కోసం వర్క్ షాప్ లు నిర్వహిస్తే మంచిదని పేర్కొన్నారు మెగాస్టార్‌ చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news