ఆయన చొరవతోనే విజయనిర్మలను వివాహం చేసుకున్న సూపర్ స్టార్..!!

-

సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి అత్యాధునిక టెక్నాలజీని పరిచయం చేస్తూ.. ఈస్ట్ వన్ కలర్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ముఖ్యంగా కౌబాయ్ వంటి హాలీవుడ్ చిత్రాలను కూడా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం చేసిన ఘనత కూడా కృష్ణకు మాత్రమే చెల్లింది. ఇక ఆయన ఇలాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించడానికి కారణం కూడా ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల అని చెప్పవచ్చు. ఈమె దర్శకురాలిగా , హీరోయిన్ గా, నిర్మాతగా ఇలా పలు రంగాలలో మంచి ప్రావీణ్యం పొంది ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇక విజయనిర్మల, కృష్ణ హీరో హీరోయిన్లుగా నటించడమే కాకుండా విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను సొంతం చేసుకున్నారు.

ఇక ఈ క్రమంలోనే విజయనిర్మలతో బాగా పరిచయం ఏర్పడి.. ఆమెను దగ్గర్నుంచి చూసిన ఈయన ఆమెను ప్రేమించాడు. కానీ అదే సమయానికి కృష్ణకు ఇందిరతో వివాహం జరిగి రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల ముగ్గురూ కూడా జన్మించారు. ఇక విజయనిర్మలకి కూడా వివాహం జరిగి నరేష్ సంతానంగా ఉన్నాడు. కానీ ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడం జరిగింది. ఇకపోతే కృష్ణ విజయనిర్మలను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు తన కుటుంబంలో చెప్పగా.. కృష్ణ కుటుంబ సభ్యులు వీరి వివాహానికి పూర్తిగా అడ్డు చెప్పారు. ముఖ్యంగా కృష్ణ తల్లి నేరుగా కృష్ణ ముఖం మీదనే ఈ పెళ్లికి నేను ఒప్పుకోవట్లేదు. ఇందిరకు అన్యాయం చేస్తావా అంటూ ఆమె నిలదీసిందట.కానీ ఎట్టకేలకు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషు చొరవ తీసుకొని అటు ఇందిరను ఇటు వారి తల్లిని ఒప్పించి చివరికి విజయనిర్మలతో కృష్ణకు రెండో వివాహం జరిపించారు . ఇక వివాహం అనంతరం విజయనిర్మల దగ్గరుండి మరి కృష్ణకు అన్ని సేవలు చేసింది . అందుకే ఆమె మరణించిన సమయంలో కూడా ఆయన ఆ విషయాన్ని జీర్ణించుకోలేక తన ఇంటిలోనే ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ప్రతిరోజు ఆ విగ్రహంలో విజయనిర్మలను చూసుకుంటూ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చివరి దశను కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news