నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2022 లో రజత పథకాన్ని సాధించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచ అథెలిటిక్స్ ఛాంపియన్షిప్ చరిత్రలో పథకం గెలిచిన రెండో భారత అథ్లెట్ గా నీరజ్ చోప్రా నిలిచాడు. నీరజ్ చోప్రా 88.13 మీటర్లు విసిరి నాలుగవ త్రోతో రజత పథకాన్ని కైవసం చేసుకున్నాడు. తన నాలుగవ ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరి ఈ ఘనత సాధించాడు. ఇక ఈ ఘనత సాధించిన నీరజ చోప్రా పై ప్రశంసల వర్షం కురిసింది.
ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, క్రీడల మంత్రి అనురాధ్ ఠాకూర్ తదితరుల ప్రముఖులు నీరజ్ ప్రదర్శనను కొనియాడారు. ఇక పథకం సాధించిన అనంతరం నీరజ్ మాట్లాడుతూ..”తొలి మూడు ప్రయత్నాల్లో జావెలిన్ ను అనుకున్నంత దూరం విసరలేకపోయినా నాలుగో ప్రయత్నంలో అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నాను.
ఏ క్రీడాకారుడైన బరిలోకి దిగిన ప్రతిటోర్నీలో స్వర్ణ పథకం సాధించలేడు. ప్రపంచ సీనియర్ ఛాంపియన్షిప్ మినహా అన్ని ప్రముఖ టోర్నీలలో నేను బంగారు పతకాలు సాధించాను. నా ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకొని వచ్చే ఏడాది హంగేరీలో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పథకం సాధించేందుకు కృషి చేస్తాను”అంటూ నీరజ్ పేర్కొన్నాడు.