మీ కోసం మేమున్నాం, చిరంజీవి పెద్ద మనసు…!

-

కరోనా మహమ్మారి నడుమ సినీ కార్మికులకు మరోసారి సినీ పరిశ్రమ అండగా ఉంటుంది అని మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో సందేశంలో హామీ ఇచ్చారు. వరుసగా మూడో సారి సినీ కార్మికులు అందరికి తాము నిత్యావసర వస్తువులను సినీ పరిశ్రమ తరుపున అందించాలి అని భావిస్తున్నామని వీడియోలో చెప్పారు. కరోనా కష్ట కాలం సమయంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అని భావించి ఈ విధంగా ముందుకు వచ్చామని అన్నారు.

మాకు రాదులే, మాకు ఏమీ కాదులే అనే నిర్లక్ష్య ధోరణి ఎంత మాత్రం కూడా పనికిరాదు అని చిరంజీవి హెచ్చరించారు. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూనే మీ వారిని కూడా కాపాడుకుని జాగ్రత్తగా ఉండాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలను చిరంజీవి వీడియోలో తెలిపారు. అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ జరుపుకోవాలని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news