లాక్‌డౌన్ కారణంగా నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్ పదమూడో సీజన్ మరో నెల రోజుల్లో యూఏఈలో ప్రారంభంకానుంది. ఎనిమిది ఫ్రాంచైజీల్లో ఇప్పటికే మూడు జట్లు అక్కడికి చేరుకున్నాయి. అందులో రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ గురువారం దుబాయ్‌కు చేరుకోగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిన్న సాయంత్రం అబుదాబి చేరుకుంది. వీళ్లందరికీ తొలుత కరోనా పరీక్షలు నిర్వహించి తర్వాత బయో బుడగలోకి అనుమతిస్తారు. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు నేడు విమానాలు ఎక్కనున్నాయి.
ఇటీవల భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దేశంలో చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమం ఊపందుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్‌పైనా ప్రభావం చూపించింది. టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న మొబైల్ సంస్థ వివో.. ఈ ఏడాది ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్లను ఆహ్వానించగా ‘డ్రీమ్ 11’ అనే ఫాంటసీ గేమింగ్ సంస్థ రూ.222 కోట్లకు ఈసారి ఆ హక్కులను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే 2020 ఐపీఎల్ లోగో కూడా మారింది. అందుకు సంబంధించిన ఫొటోను ముంబయి ఇండియన్స్ జట్టు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. అలాగే ఐపీఎల్ టీ20 ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లోనూ కొత్త లోగో దర్శనమిచ్చింది.
View this post on Instagram
Now taking guard 👉 #Dream11IPL 👏🏻 . Congratulations, @dream11! . #OneFamily @iplt20