‘చిరు’సాయం కాంగ్రెస్‌కు లేనట్లేనా? వాళ్ళకే సపోర్ట్ ఉంటుందా?

-

మెగాస్టార్ చిరంజీవి….తెలుగు చిత్రసీమలో నెంబర్ 1 హీరో. తరాలు మారిన చిరు ప్లేస్ మాత్రం మారడం లేదు. ఇప్పటికే చిరుకు అదే ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. అయితే సినిమాల్లో నెంబర్ 1గా ఉన్న చిరు, రాజకీయాల్లో నానా ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. 2009లో ప్రజారాజ్యం పేరిట పార్టీ పెట్టి, ఎన్నికల్లో విఫలమై, 18 సీట్లు గెలుచుకుని, ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు.

అలాగే కాంగ్రెస్‌లో రాజ్యసభ దక్కించుకుని, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత చిరు రాజకీయాలకు దూరమయ్యారు. మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. కాకపోతే చిరుని మళ్ళీ తమ పార్టీలో యాక్టివ్ చేయాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ చిరు మాత్రం సినిమాలు, సేవాకార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు.

అయితే ఇటీవల తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డిని నియమించిన కాంగ్రెస్, ఏపీపై కూడా దృష్టి పెట్టింది. అక్కడ పార్టీ బలపడాలంటే చిరంజీవిని మళ్ళీ కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో జగన్ మీద వ్యతిరేకిత మొదలైందని, అటు చంద్రబాబు పుంజుకోలేకపోతున్నారని, ఈ తరుణంలో చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే బెనిఫిట్ అవుతుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ చిరు మళ్ళీ రాజకీయాల్లోకి రావడం చాలా కష్టమని తెలుస్తోంది. ఆయన సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు.

కాబట్టి కాంగ్రెస్‌కు చిరు సాయం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో చిరంజీవి పరోక్షంగా తెలంగాణలో కేసీఆర్‌కు, ఏపీలో జగన్‌కు సపోర్ట్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. పలు సందర్భాల్లో చిరు…కేసీఆర్, జగన్ల నిర్ణయాలకు మద్ధతు పలికారు. మరి ఈ పరిస్తితిని చూసుకుంటే చిరంజీవి, కాంగ్రెస్‌లోకి తిరిగి రావడం కష్టమే అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news