వరుసగా పదోరోజూ లోక్‌సభలో గందరగోళం.. రాజ్యసభ వాయిదా

-

 

న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. పెగాసస్ వ్యవహారంపై చర్చకు రెండు సభల్లోనూ ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. లోక్‌సభ ప్రారంభమవడంతోనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. పెగాసస్‌పై చర్చ పట్టుపట్టాలని డిమాండ్ చేశాయి. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో లోక్ సభలో గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల అరుపులు, కేకలతో లోకసభ దద్దరిల్లింది. అధికార ఎంపీలపై పత్రిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. విపక్షాల ఆమోదం లేకుండా పలు బిల్లులు ఆమోదించుకుంటున్నారని నినాదాలు చేశారు.

ఇదే గందరగోళం రాజ్యసభలోనూ కొనసాగింది. పెగాసస్‌పై చర్చ పెట్టాల్సిందేనని ఈ సభలోనూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. పెద్ద పెద్దగా నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు రాజ్యసభను వాయిదా వేశారు. విపక్ష సభ్యుల తీర మారాలని అన్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలపై సస్ఫెన్షన్ వేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు సభకు సహకరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news