చిరంజీవి – బాలయ్య లో ఉన్న కామన్ పాయింట్ అదే అంటున్న కొరియోగ్రాఫర్..?

-

చిరంజీవి , బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ ఇద్దరి స్టార్ హీరోల అభిమానుల మధ్య ఎప్పుడూ వార్ నడుస్తూనే ఉంటుంది. మా స్టార్ హీరో గొప్ప అంటే మా స్టార్ హీరో గొప్ప అనే వివాదం ఎప్పుడు తరచూ వినిపిస్తూనే ఉంటుంది.అయితే తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్.. చిరంజీవి, బాలకృష్ణలో ఉన్న కామన్ క్వాలిటీ గురించి మీడియాతో పంచుకున్నారు. ఇటీవల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. చిరంజీవి, బాలకృష్ణ గార్లలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటి అంటే వారి అంకితభావం , సమయపాలన.. ఏ డాన్స్ మూమెంట్ అయినా సరే సక్సెస్ఫుల్గా పూర్తి చేసే వరకు రిలాక్స్ అవ్వరు ..అందుకే వారు నేడు ఈ స్థానంలో ఉన్నారు అంటూ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు.

అలాగే ఈ రెండు చిత్రాలను నవీన్ ఎర్నేని , వై రవిశంకర్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వాల్తేరు వీరయ్య లోని అన్ని పాటలకు , అలాగే వీరసింహారెడ్డి లోని రెండు పాటలకు సుగుణసుందరి, మా బావ మనోభావాలు పాటలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు శేఖర్ మాస్టర్. ఈ క్రమంలోనే సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రెండూ ఒకేసారి సంక్రాంతి సమయంలో రిలీజ్ అవుతాయని అనుకోలేదు.అందుకే ఈ సినిమాల్లోని పాటలకు నృత్య రీతులు సమకూర్చేటప్పుడు పెద్దగా ఆందోళన పడలేదు.

కానీ ఇప్పుడు రెండు చిత్రాలు సంక్రాంతికి వస్తుండడంతో ఒకవైపు ఆందోళన మరొకవైపు సంతోషం కూడా మొదలైంది. ఈ సంక్రాంతి నాకు పెద్ద పండుగ అని చెప్పగలను. ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ శేఖర్ మాస్టర్ తన మనసులో మాటను బయటపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news