రాజధాని భూముల అమ్మకం మీద సీఐడీ దర్యాప్తు ముమ్మరం

-

అమరావతి అసైన్డ్ భూములపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మల్కాపురంలో అసైన్డ్ భూముల రైతుల్ని సీఐడీ విచారిస్తోంది. 5 బృందాలతో 50 మంది రైతులని విచారిస్తున్నారు. న్యాయవాదులతో కలిసి విచారణకు రైతులు హాజరయ్యారు. లాయర్ల సమక్షంలో రైతుల్ని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. పూలింగుకు తమ భూములిస్తామన్నా గత ప్రభుత్వం తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. అసైన్డ్ భూములను అమ్మమని ఒత్తిడి తెచ్చినా అమ్మకపోవడంతో పూలింగుకు తమని దూరంగా ఉంచారని దళిత రైతులు ఆరోపిస్తున్నారు.

అయితే అనూహ్యంగా అమ్మిన వారు మాత్రం తమను ఎవరూ బలవంతం చేయలేదని, అసైన్డ్ భూములకు తక్కువ డబ్బు వస్తుందని బ్రోకర్లు ప్రలోభాలకు గురి చేయడంతో తాము అమ్ముకున్నామని చెబుతున్నారు. దానికి వ్యతిరేకంగా తమ భూములు తీసుకోలేదని కొందరు రైతులు ఆరోపించడం ఆస్కతికరంగా మారింది. మరి ఈ అంశం మీద సీబీఐ ఎలాంటి కేసులు నమోదు చేయనుంది అనేది ఆసక్తికరంగా మారింది.  

Read more RELATED
Recommended to you

Latest news