BREAKING : సినీ హీరో నవీన్ రెడ్డి అట్లూరీ అరెస్ట్

-

సినీ హీరో నవీన్ రెడ్డి అట్లూరీ అరెస్ట్ అయ్యాడు. ఎన్ స్క్వేర్ కంపెనీ లో డైరెక్టర్ గా పని చేసిన నవీన్ రెడ్డి… కంపెనీ సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టాడు. ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అరోపణలు కూడా ఉన్నాయి. సమారు రూ.55 కోట్లు మోసం చేసినట్లు నవీన్ రెడ్డి పై భాదితులు Nsquare డైరెక్టర్లు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు సిసిఎస్ లో ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో సినీ హీరో అట్లూరి నవీన్ రెడ్డి పై సెక్షన్లు 420, 465,468,471 r/w 34 IPC కింద కేసు నమోదు అయ్యాయి. కేసు నమోదు చేసి విచారించిన సిసిఎస్ పోలీసులు… నవీన్ ను చర్లపల్లి జైలుకు రిమాండ్ తరలించారు. మోసం చేసిన డబ్బులతో నవీన్ రెడ్డి జల్సాలు చేశాడని తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, కోడిపుంజులగూడెం కు చెందిన నవీన్ రెడ్డి పై గతంలో బైక్ దొంగతనం కేసులు సైతం ఉన్నాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news