కిటికీలను ఇలా సులభంగా శుభ్రం చేసుకోండి…!

-

ఇంటిని శుభ్రం చేసుకోవడం నిజంగా ఒక పెద్ద పనే. త్వరగా దుమ్ము, ధూళి తొలగిపోవు. దాని కోసం చాలాసేపు శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ని మీరు కిటికీలను శుభ్రం చేయడంలో పాటించారు అంటే వేగంగా మురికి వదిలిపోతుంది. అయితే మరి ఇంకా ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ హోమ్ టెక్నీక్స్ ని చూసేద్దాం.

వెనిగర్ సొల్యూషన్:

దీని కోసం మీరు కొద్దిగా వినిగర్ ని తీసుకోండి. ఎంత వినిగర్ ని తీసుకున్నారో అన్ని నీళ్లు తీసుకోండి ఈ రెండింటినీ కలిపి ఒక బాటిల్లో పోయండి. దీనిని కిటికీలను శుభ్రం చేయడంలో ఉపయోగించారు అంటే సులువుగా దుమ్ము, ధూళి తొలగిపోతాయి.

దీనిని మీరు అద్దాల మీద కూడా ఉపయోగించవచ్చు. అలానే మార్బుల్ గ్రానైట్ మీద కూడా ఉపయోగించవచ్చు. స్ప్రే బాటిల్ లో వేసిన దానిని స్ప్రే చేసి వి కిటికీని మైక్రో ఫైబర్ క్లాత్ తో ఒకే డైరెక్షన్ లో చదవండి.ఇలా చేయడం వల్ల సులువుగా కిటికీకి ఉన్న దుమ్ము అంతా పోతుంది.

నిమ్మరసం:

దీనికోసం మీరు కొద్దిగా నీళ్లు రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం ఒక స్ప్రే బాటిల్ తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉపయోగించి మీరు కిటికీలు తుడవడం వల్ల ఈజీగా మరకలు పోతాయి. దీనితో మీరు అద్దాలు, ప్లాస్టిక్ లేదా సిరామిక్ వాటి పై కూడా తుడవచ్చు. మార్బుల్, గ్రానైట్ మీద కూడా ఉపయోగించవచ్చు. అయితే స్ప్రే బాటిల్ లో ఇలా మిశ్రమాన్ని కలుపుకుని దానిని స్ప్రే చేస్తూ మైక్రో క్లాత్ తో తుడిస్తే వెంటనే మరకలు పోతాయి.

డిష్ డిటర్జెంట్:

సాధారణంగా మనం గిన్నెలు తోమడానికి డిటర్జెంట్లు ఉపయోగిస్తారు కదా. దానినే కిటికీలు కూడా ఉపయోగించవచ్చు. కొద్దిగా డిష్ వాష్ తీసుకుని దానిలో వేడి నీళ్లు పోసి ఒక స్ప్రే బాటిల్ లో పోయండి. లేదా బకెట్లో వేయండి. ఇప్పుడు ఒక చిన్న క్లాత్ తీసుకుని ఆ మిశ్రమంతో కిటికీలను శుభ్రం చేయండి. దీనితో కూడా ఇట్టే మరకలు, దుమ్ము, ధూళి తొలగిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news