కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ఈ నెల 13 వ తేదీన ప్రకటించనున్నారు. కానీ ఈ రెండు రోజులలో ఎన్నికల ప్జహాలితాలను వివిధ సర్వేలు ఊహించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయని అన్న విషయాలను వెల్లడిస్తారు. ఇక నిన్న ఎన్నికలు ముగిసిన అనంతరం కొన్ని సర్వేలు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పగా, కొన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలను ప్రకటించాయి. కానీ ఎక్కువ శాతం మాత్రం కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడంతో కర్ణాటక ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై కొట్టిపారేశారు. గతంలో కూడా ఇదే విధంగా కొన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయాని .. కానీ ఏమైంది చివరికి బీజేపీ అధికారంలోకి వచ్చింది.
ఇప్పుడు జరిగిన ఎన్నికల్లోనూ అదే జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు సర్వ్ ఫలితాలు అన్నీ రివర్స్ అయ్యి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చి మళ్ళీ మేమె అధికారంలో కొనసాగుతామని చెప్పారు.