సీఎం చంద్రబాబు ఏలూరు, కడప షెడ్యూల్ ఖరారు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11, 12 తేదీలలో ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ పార్టీ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తూ.. దేవదర్శన కార్యక్రమాల్లో పాల్గొనడానికి సీఎం పర్యటన షెడ్యూల్ ని అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 11న ఏలూరు జిల్లా పర్యటన చేయనున్నారు. ఇందులో 11వ తేదీ ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు అగిరిపల్లి మండలం వడ్లమాను వెళ్లేందుకు హెలికాప్టర్ లో బయలుదేరుతారు.

ఉదయం 10.20 కి స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సీఎంకు స్వాగతం పలుకుతారు. అనంతరం 10.30 గంటకు సీఎం బీసీ వర్గాల ప్రజలతో వారి పని ప్రదేశంలో సమావేశమవుతారు. 11.30 గంటలక ప్రజావేదిక వద్ద పబ్లిక్ ఇంటరాక్షన్ నిర్వహించనున్నారు. ఒంటిగంటకు పార్టీ కేడర్ తో సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు హెలికాప్టర్ లో విజయవాడ ఎయిర్ పోర్ట్ కి బయలుదేరుతారు. ఆ తరువాత మధ్యాహ్నం 3.30 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి కడప ఎయిర్ పోర్ట్ కి బయలుదేరుతారు. ఆ తరువాత మధ్యాహ్నం 3.30 విజయవాడ నుంచి కడపకు బయలుదేరి అక్కడి నుంచి ఒంటిమిట్ట టీటీడీ గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు.

టీటీడీ గెస్ట్ హౌస్ నుంచి 6 గంటల నుంచి 6.30 గంటల వరకు ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 6.45 నుంచి 8.30 గంటల వరక జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. తిరిగి 8.40కి టీటీడీ గెస్ట్ హౌస్ కి చేరుకొని అక్కడే రాత్రి బస చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news