పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలు ఆగిపోతాయి : సీఎం జగన్

-

Cm Jagan: పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. పథకాలు ఆగిపోతాయని పేర్కొన్నారు సీఎం జగన్. ఇవాళ తాడిపత్రి నియోజక వర్గంలో ప్రచారం చేసిన సీఎం జగన్‌.. అనంతరం మాట్లాడుతూ..బాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమే అంటూ చురకలు అంటించారు సీఎం జగన్. జగన్ పైకి అందరూ కలిసికట్టుగా వస్తున్నారు…వాళ్లందరికీ మీరే బుద్ధి చెప్పాలని కోరారు.

Cm Jagan about ap schemes

మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించామని… 99 శాతం మేనిఫెస్టో హామీలను అమలు చేశామన్నారు సీఎం జగన్‌. రూ.2.70లక్షల కోట్లు నేరుగా మీ ఖాతాల్లో జమ చేశామని.. ఎక్కడ లంచాలు లేవు, వివక్ష లేదని వివరించారు సీఎం జగన్. 2లక్షల 30వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాము… 80 శాతం ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చామన్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news