ఏపీ రైతులకు శుభవార్త..80 శాతం సబ్సిడీతో విత్తనాలు

-

ఏపీ రైతులకు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి శుభవార్త చెప్పారు. 80 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు సీఎం జగన్. పంట నష్టం అంచనాలో అధికారులు ఉదారంగా వ్యవహరించాలని, ఎక్కడ రైతులు నిరాశకు గురి కాకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు.

కలెక్టర్లతో సమావేశంలో మాట్లాడుతూ, ‘రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని, తక్కువ రేటుకు కొంటున్నారనే మాట వినిపించకూడదు. మళ్ళీ పంటలు వేసుకోవడానికి 80% సబ్సిడీతో విత్తనాలు అందించాలి. ఇళ్లు ముంపునకు గురైన వారికి రూ. 2వేల తో పాటు రేషన్ ఇవ్వాలి’ అని ఆదేశించారు.

వర్షాల కారణంగా రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఆదేశించారు. అటు ఈ భీభత్సం వల్ల మరణించిన వారికి నష్ట పరిహారం చెల్లించాల్సిన కూడా పేర్కొన్నారు సీఎం వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి. అలాగే రైతులకు పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలని, దాని కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news