BRS కు వైసీపీ పార్టీ మద్దతు – సజ్జల సంచలన ప్రకటన

-

BRS కు వైసీపీ పార్టీ మద్దతు ఇవ్వడంపై సజ్జల రాజకృష్ణా రెడ్డి కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పై మా ఒపీనియన్ మాకుందని ఈ సందర్భంగా సజ్జల పేర్కొన్నారు. బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ అడిగితే ఏం చేయాలనే విషయమై ఆలోచిస్తామన్నారు సజ్జల రాజకృష్ణా రెడ్డి.

దీనిపై అందరితో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చే ఆలోచన వైసీపీకి లేదని స్పష్టం చేశారు సజ్జల. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదే.. రాజకీయ పార్టీగా ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చని వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news