కరోనా మృతుల కుటుంబాలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా ను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి కోవిడ్ మృతుల జాబితా రూపొందించి చెల్లింపులు చేయాలని సూచనలు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ జారీ చేయాలని మార్గదర్శకాలు విడుదల చేసింది సర్కార్. మృతుల కుటుంబాల నుంచి దరఖాస్తు తీసుకున్న రెండు వారాల్లోగా పరిహారం చెల్లింపు పూర్తి చేయాలని సూచనలు చేసింది. దరఖాస్తు కోసం ప్రత్యేక ప్రొఫార్మా కూడా రూపొందించింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ. ఈ ఉత్తర్వుల ప్రకారం.. త్వరలోనే బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందనుంది.