ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతుల పాలిట దేవుడిగా అవతరించాడు అని చెప్పాలి. రైతుల విషయంలో ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటూ వారికోసం కీలక చట్టాలు తీసుకొస్తూ వారికీ అండదండగా నిలుస్తున్నారు. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఏప్రిల్ 15 నుండి రబీ వరి పంట చేతికి వస్తున్నందున… ధాన్యం సేకరించడానికి అవసరం అయిన ఏర్పాట్లను త్వరితగతిన చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాడు.
ఇటీవల ఆకాల వర్షాల కారణంగా చేతికి అందివచ్చిన పంటలు ఎన్నో నేలకూలాయి. దీని వాన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టాల పైన సరైన విచారణ జరిపి ఒక రిపోర్ట్ ను వీలైనంత త్వరగా ఇవ్వాలని కూడా జగన్ అధికారులకు చెప్పడం జరిగింది. ఇక రైతులకు అవసరం అయిన ఎరువులు, పురుగుమందులు, వ్యావసాయ పరికరాలు , డ్రోన్లు , టార్బాలిన్లు మరియు స్ప్రేయర్లు ఇవ్వాలని జగన్ సూచించారు.