తిరుపతి పార్లమెంటు పరిధిలో వైసీపీ విజయం కోసం తీవ్రంగా కష్టపడుతున్నా సరే కొంత మంది ఎమ్మెల్యేలు మాత్రం కష్టపడే ప్రయత్నం చేయడం లేదు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ మరో పక్క భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నా… కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రస్థాయిలో కష్టపడుతున్నా… కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాష్ట్ర స్థాయి నాయకులు కూడా అక్కడికి వెళ్లి తమ వంతుగా కృషి చేస్తున్నా సరే వైసీపీ మాత్రం భిన్నంగా ఉంది.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు కష్టపడకపోతే వైసీపీకి మెజార్టీ భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి అని ఆందోళన ఎక్కువగా వ్యక్తమవుతుంది. కాబట్టి వైసీపీ నేతలు అందరూ కూడా సమిష్టిగా పని చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ నేతల్లో అలాంటి పరిస్థితి కనబడటం లేదని చాలామంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎమ్మెల్యేల విషయంలో చాలా సీరియస్ గా ఉందని అంటున్నారు.
దాదాపుగా తిరుపతి పార్లమెంటు పరిధిలో ప్రచారం చేయడానికి వెళ్ళిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పని చేయడం లేదని జగన్ భావిస్తున్నారు అందుకే వాళ్లతో మాట్లాడటానికి ఆయన సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. ఎమ్మెల్యేలతో జగన్ ఫోన్లో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.