తెలంగాణకు అలెర్ట్..గాలి నుంచి కరోనా, ఇంట్లో ఉన్నా మాస్కులు, అసలేం జరుగుతోంది ?

-

ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు కానీ తెలంగాణలో దారుణంగా ఉందని అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ గాలి ద్వారా సంక్రమించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయని నిన్న తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ఎల్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో ఈ పరిస్థితి ఉంది. అందుకే అక్కడ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

 

తెలంగాణలో ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటే ఇంట్లో ఉన్న సమయంలో కూడా కరోనా సోకకుండా మాస్కులు ధరించాలని అధికారులు చెబుతున్నారు. ఈ కరోనా సెకండ్ వేవ్ మొదటి వేవ్ కంటే వేగంగా విస్తరిస్తోంది అని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా చాలాచోట్ల ఆసుపత్రులలో బెడ్స్ కొరత ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణ తట్టుకోలేదని అంటున్నారు.

corona
corona

తెలంగాణలో కూడా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని కానీ ఆర్థికంగా పుంజుకోలేము అనే కారణంగా లాక్ డౌన్ విధించే ఆలోచనలు చేయడం లేదని తెలుస్తోంది. అదీకాక నిన్న తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అన్ని జిల్లాల హెల్త్ ఆఫీసర్ లు ఇతర వైద్య అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పది కంటే ఎక్కువ బెడ్స్ ఉన్న అన్ని నర్సింగ్ హోమ్ లు, హాస్పిటల్స్ లో కరోనా కోసం వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

 

ఈ రోజు ఏకంగా తెలంగాణ వ్యాప్తంగా మూడు వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. దేశవ్యాప్తంగా చూస్తే పదో స్థానంలో కేసులు నమోదవుతున్నా ఇక్కడి ప్రజలలో మాత్రం ఏ మాత్రం ఇంకా కరోనా మీద భయం మొదలు కాలేదు అని చెబుతున్నారు. పోలీసులకు భయపడి జరిమానాలు కట్టలేక మాస్క్ పెట్టుకుంటున్నారు తప్ప మనకు కరోనా వస్తుంది అనే భయం ఏ మాత్రం ఒక్కరిలోనూ కనిపించకపోవడం ఆందోళనకర కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news