కరోనా సంక్రమణ పెరుగుతున్న నేపద్యంలో ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు ఏపీ పంచాయతీరాజ్ శాఖ గుడ్ న్యూస్ అందించింది. ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి తారా స్తాయిలో ఉన్న నేపద్యంలో ఎగ్జామ్ కు అప్లై చేసిన అభ్యర్థులు కొందరు తమ సొంత ఊర్లకు వెళ్ళిపోయారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో వారు వారి సొంత ఊల్లను వదిలి సిటీలకు వెళ్ళి ఎక్జామ్ రాయడం అసంభవం పైగా కరోనా వ్యాప్తికి కూడా అది కారణం అవుతుంది. వారిని పరిగణలోకి తీసుకొని వారికి ఓ గుడ్ న్యూస్ ఆంధించింది ఏపీ ప్రభుత్వం. వారు మునుపు ఎంచుకున్న సెంటర్ వారి పరిదిలో లేకపోతే వారు తమ సెంటర్లను మార్చునే అవకాశం వారికి కల్పించింది. ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవాలి అనుకునే అభ్యర్థులు నేడు ఉదయం 11 గంటల నుండి జులై 2 వరకు అఫీషియల్ సైట్ లోకి లాగిన్ అయ్యి సెంటర్ ను తమ దగ్గరలోని సెంటర్ కు మార్చుకోవచ్చు. కాగా ఈ నోటిఫికేషన్ లో 19 రకాల పోస్టులకు సంబంధించి 14062 గ్రామ సచివాలయ ఉద్యోగాలను 2146 గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షను ఆగస్టు నెలలో నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
గ్రామ సచివాలయ అభ్యర్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..!
-