ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిత్యం మీటింగ్ లు , ప్రభుత్వ పర్యటనలతో చాలా బిజీగా కాలాన్ని గడుపుతుంటారు. ఒక్క రోజు సీఎం కార్యాలయానికి వెళ్లకపోయినా చాలా ఫైళ్లు మరియు పర్యటనలు వాయిదాపడిపోతాయి. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సీఎం జగన్ ఈ రోజు ఉదయం ఎప్పటిలాగే ఎక్సరసైజ్ చేస్తుండగా.. కాలు కొంచెం బెణికింది తెలిసింది. అయితే ఉదయానికి కొంచెం పర్వాలేదు అనిపించినా సాయంత్రానికి అది కాస్తా ఎక్కువగా నొప్పి అవుతోందట.
ఈ గాయాన్ని సాయంత్రం పరీక్షించిన డాక్టర్లు కొన్ని రోజులు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించారట. దీనితో రేపు వెళ్ళవలసిన ఒంటిమిట్ట పర్యటన రద్దు చేసుకోనున్నారని వార్త. గతంలోనూ ఇదే విధంగా జగన్ కు కాలికి గాయం అయ్యి చాలా రోజులు ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో దీనిని సీరియస్ గా తీసుకుంటున్నారు.