ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో 13, నియోజకవర్గాల స్థాయిలో 147, ప్రాంతీయ స్థాయిలో 4 అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు అనుమతులు లభించాయి. గుంటూరు, ఏలూరు, తిరుపతి, విశాఖలో ప్రాంతీయ ల్యాబ్స్ ఉండనున్నాయి. ఈ ల్యాబ్స్ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల క్వాలిటీని పరిశీలించనున్నారు. ఇందుకు సంబంధించి రూ.197 కోట్లతో ప్రాజెక్టు రిపోర్టును సర్కార్ నాబార్డుకు సమర్పించింది.
దీంతో నాబార్డు ఆర్‌ఐడీఎఫ్ కింద ఇప్పటికే రూ. 150 కోట్లు మంజూరు చేసింది. అధికారులు అగ్రిలాబ్స్ అభివృద్ధి చేయడంలో నిమగ్నమయ్యారు. నకిలీలను నివారించేందుకు అధికారులు ఎంత నిఘా పెట్టిన అక్రమార్కులు వాటిని కొత్త దారుల్లో ఎప్పటికప్పుడు రైతాంగాన్ని అంటగడుతూనే వస్తోంది. ఫలితంగా రైతులు పంట దిగుబడినే కోల్పోవడమే కాకుండా ఆర్థికంగానూ చితికిపోతున్నారు. దీన్ని గమనించిన సీఎం జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.