నిన్న ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో కీలక అంశాలపై చర్చించారు. అంతే కాకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది నుండి మళ్ళీ రోడ్లపై తిరగాలని సీఎం మంత్రులకు సూచించారు. మన ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తయ్యాక మళ్ళీ మనమంతా రోడ్లపైకి వచ్చి తిరగాలని సీఎం సూచించారు.
ఐ ప్యాక్ బృందం వస్తోందని..గడప గడప కూ వైసీపీ కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళ్ళాలని సూచించారు. అంతే కాకుండా కరోనా పరిస్థితులను రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తా అని జగన్ స్పష్టం చేశారు. అక్టోబర్ నుండి సచివాలయాలను ఎమ్మెల్యే లు మంత్రులు సందర్శించాలని జగన్ ఆదేశించారు. ఇక సీఎం స్పీడ్ చూస్తుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుండే రంగం లోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది.