దేశంలో ఎలాంటి అవినీతి మరక లేని నాయకుడుని..40 ఏళ్ల ఇండస్ట్రీ.. ఎప్పుడు అవినీతికి పాల్పడలేదు..నిప్పు లాగా బ్రతికాను.. తనని శంకిస్తే బూడిదైపోతారనే విధంగా బాబు ఎప్పుడు తన గురించి తాను డప్పుకొట్టుకునే విషయం తెలిసిందే. తనపై ఎన్నో కేసులు పెట్టారో..ఎన్నో ఆరోపణలు చేశారు ఏవి నిరూపించలేకపోయారంటూ చెప్పుకొస్తారు. అలా నిప్పు నిప్పు చెప్పుకునే బాబు ఏకంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్ట్‌లో కమిషన్ల రూపంలో 118 కోట్లు నోక్కేసారట.
ఈ విషయంలో అధికార వైసీపీ చెబితే..పోనీ ఏదో రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఏకంగా ఐటీ శాఖ తేల్చి చెప్పింది. తాజాగా షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి.. ఈ క్రమంలో బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఐటి అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ విషయాన్ని మనోజ్ సైతం అంగీకరించారు. ఈ నేపథ్యంలోనే ఆగష్టు 4వ తేదీన.. హైదరాబాద్ ఐటీ సెంట్రల్ సర్కిల్ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
కమిషన్ల రూపంలో వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించినట్లు ఐటి శాఖ నోటీసుల్లో ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే అమరావతి, అటు పోలవరం..ఇంకా పలు ప్రాజెక్టుల విషయాల్లో అంచనాలకు మించి కాంట్రాక్టుల రేట్లు పెంచేసి..కావల్సిన వారికి ఇచ్చుకుని…వారి నుంచి కమిషన్ల రూపంలో కోట్లు దండుకోవడం అనేది బాబుకు తెలిసిన విద్య అనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో షాపూర్జీ పల్లోంజీ కంపెనీ.. కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టిడ్కో ఇళ్లు, అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణం..ఇలా పలు నిర్మాణాలకు 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ పనులు చేసింది. అయితే 2019 జనవరి, ఫిబ్రవరిలో చంద్రబాబు.. షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్‌ని పిలిపించుకుని తన పీఏ శ్రీనివాస్ ద్వారా కమిషన్ తీసుకున్నట్లు తెలిసింది. ఇక ఆ కమిషన్లని కొన్ని కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టుల కింద డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఇలా 118 కోట్లు నోక్కేశారని తెలిసింది..దీనిపై ఐటీ నోటీసులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఇవన్నీ తప్పించుకునేందుకు బాబు..ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినట్లు సమాచారం.