సీఎం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నేటికి సరిగ్గా 4 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా వైసిపి నాయకులు కార్యకర్తలు రాష్ట్రంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా తాను ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన నేపథ్యంలో సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రజా సంకల్ప యాత్ర కు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్ళు అయ్యింది అని జగన్ పేర్కొన్నారు. నాడు-నేడు యాత్ర నా ప్రయాణం ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కోసమే అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
మీ అందరి ఆత్మీయ అనురాగాలతో యాత్ర కొనసాగుతుందని సీఎం ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక సీఎం చేసిన ట్వీట్ కు ఆయన అభిమానులు వైసీపీ కార్యకర్తలు సమాధానాలు ఇస్తూ మీ యాత్రను ఇలాగే కొనసాగించండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఆయన చేసిన అభివృద్ధి పనులను కామెంట్ రూపంలో పెడుతున్నారు. ఇదిలా ఉంటే మరి కొందరు ప్రజలు ప్రజా సంకల్ప యాత్ర లో చెప్పిన వాటిలో ఒకటి అయినా చేశారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మద్యపాన నిషేధం… పింఛన్ గురించి సిపిఎస్ రద్దు ..కరెంట్ బిల్లుల బాధుడు అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు.