ఒక రాజకీయ పార్టికి విశ్వసనియత మేనిపేస్టోనేనని అన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ప్రతి హామీని మతగ్రంధంగా పవిత్రంగా బావించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలలో ఒకరాజకీయ పార్టీ ఇచ్చిన హామీలు పవిత్రమైనవిగా బావిస్తారని.. సీఎం జగన్ 98.44 శాతం ఎన్నికలలో ఇచ్చిన హామిలు నెరవేర్చారని కొనియాడారు. దేశవ్యాప్తంగా అంకితబావం , నిబద్దతకు ప్రతిరూపం జగన్ అన్నారు. గతంలో 612 హామీలు ఇచ్చారని , అన్ లైన్ లో పెట్టీ
జనాలు ప్రశ్నిస్తున్నారని ఆన్ లైన్ నుంచే తొలగించారని దుయ్యబట్టారు.
ప్రజలకు మాట ఇచ్చి, మాట తప్పిన వాడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. కళ్యాణమస్తూ , షాదీతోపా అక్టొబర్ 1 నుంచి ప్రారంబిస్తున్నామన్నారు. బిసి , ఎస్సి , ఎస్టీ, బవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు సర్కార్ బాసటగా నిలబడుతుందన్నారు. ఎస్సీ, ఎస్స్టీ లకు లక్షరూపాయలు , ఎస్సీల కులాంత వివాహాలకు లక్షా ఇరవై వేలు ఇస్తున్నామన్నారు. మెనిపెస్టొకి కట్టుబడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ కొనియాడారు. గతంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరు , ఇక అతనికి అతనే పోటీ అన్నారు.